PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 8:30 pm Posted By : A YESOBU

చెస్ లో సత్తా చాటిన విద్యార్థులు…

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 24

మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తొలి చెస్ ఛాంపియన్‌ షిప్ పోటీల్లో పుల్లల చెరువు మండలం శతకోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.మండల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో అగ్ర స్థానాలు కైవసం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందారు.అండర్-19 బాలుర విభాగంలో బి. శివకృష్ణ ప్రథమ స్థానం సాధించగా, బాలికల విభాగంలో యల్. నయోమి ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. అలాగే అండర్-17 విభాగంలో వై. మణికంఠ ప్రథమ స్థానం, యు. రాజు ద్వితీయ స్థానం పొందారు.విద్యార్థుల విజయానికి శిక్షణ అందించిన ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్, శతకోడు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పి. కుమారస్వామి, సహకరించిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పి. బసవేశ్వరరావును మండల విద్యాశాఖ అధికారులు భాస్కర్, ఇందిరా ప్రసాద్ అభినందించారు.విజేతలు రాబోయే రాష్ట్రస్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.