PEN POWER
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:26 pm Posted By : YEDUKONDALU DADALA

జర్నలిజం సమాజానికి అద్దం – ఎస్సై ఎం. మోహన్ కుమార్

  1. కాజులూరు మండలం గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్‌ను బుధవారం కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్టులఅసోసియేషన్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై మోహన్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిజం పాత్ర అత్యంత ప్రాముఖ్యత కలిగినదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వానికి మరియు పోలీసు శాఖకు సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు.ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది పాత్రికేయులేనని ఆయన గుర్తు చేశారు.పోలీసులు మరియు జర్నలిస్టుల మధ్య మంచి అనుబంధం ఉండడం వల్ల ప్రజలకు మరింత సేవ చేయగలమని తెలిపారు. జర్నలిస్టులు తమ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తారని, కొన్ని సందర్భాల్లో పోలీసుల కంటే ముందుగానే వారికి సమాచారం అందుతుందని ఆయన వ్యాఖ్యానించారు.జర్నలిస్టులు చేస్తున్న సేవలకు పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఎస్సై భరోసా ఇచ్చారు. త్వరలో జిల్లా ఎస్పీ సమక్షంలో కాజులూరు మండల జర్నలిస్టులతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలకు ఉపయోగపడే సమాచారం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంశాలపై చర్చ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాజులూరు మండల వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవు మహేష్, అధ్యక్షుడు వి. గణపతి,ప్రధాన కార్యదర్శి డి. ఏడుకొండలు, ఖజాంచీ కె. గంగరాజు, ఉపాధ్యక్షుడు ఏ. శ్రీనివాస్, ఈసీ సభ్యులు పి. కిషోర్, ఏ. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.