PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 2:43 pm Posted By : M CHANTI BABU

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విశ్రాంతి బల్లల ఏర్పాటు 


గూడెం కొత్త వీధి,మార్చి 28:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డికొండ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి మరియు చర్చి ఆవరణల్లో కీర్తిశేషులు మాదిరి జోగినాదం, నూకలమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాదిరి చంటిబాబు ఆధ్వర్యంలో విశ్రాంతి బల్లలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి మిత్రులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ ఇమ్మానియేల్, గ్రామ పెద్దలు పనసల చిట్టిబాబు, గెమ్మెల సుబ్బారావు, మర్రి సుబ్బారావు, గ్రామ యువత అచ్చిబాబు, వసుపరి బాబా కిరణ్ (లాయర్), ఈశ్వరరావు, కృష్ణ, రవి, దినకరన్ తదితరులు పాల్గొన్నారు.విశ్రాంతి బల్లల ఏర్పాటు ద్వారా గ్రామ ప్రజలకు, భక్తులకు సౌకర్యం కలుగుతుందని, ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు మాదిరి చంటిబాబు కృతజ్ఞతలు తెలిపారు.