PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 12:30 pm Posted By : M CHANTI BABU

తెరుచుకున్న జీకే వీధి పెట్రోలు బంక్

బకాయిలు చెల్లింపుతో విక్రయాలు ప్రారంభం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 19:

గత వారం రోజులుగా మూతపడిన గూడెం కొత్త వీధి పెట్రోల్ బంక్ ఎట్టకేలకు తెరుచుకుంది. బుధవారం రాత్రి నుంచి బంకు సూపరిండెంట్ జుర్ర శ్రీనివాసరావు విక్రయాలను పున ప్రారంభించారు. గిరిజన సహకార సంస్థ, పాడేరు ఐటిడిఏ సంయుక్తంగా జీకే వీధిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకు హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. అయితే ఆ సంస్థకురూ. 25 లక్షలు బకాయి ఉండడంతో ఆ సంస్థ ఇంధనం సరఫరాను నిలిపివేసింది. దీంతో వారం రోజుల కిందట పెట్రోల్ బంక్ మూతపడింది. వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు పత్రికల్లో ప్రచురితం కావడంతో జిసిసి చింతపల్లి డి ఎం సింహాచలం, జీకే వీధి బ్రాంచ్ మేనేజర్ రాజబాబు, బంక్ సూపర్వైజర్ శ్రీనివాసరావులు మళ్లీ బంకు తెరిచేలా చర్యలు చేపట్టారు. బకాయి నిధులను హెచ్పి సంస్థకు చెల్లించడంతో బుధవారం సాయంత్రం ఇంధన ట్యాంకర్ ను పంపించారు. దీంతో బుధవారం రాత్రి 7 గంటల నుంచి పెట్రోల్ డీజిల్ విక్రయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంక్ సిబ్బంది ముక్కలి గిరి, లకే రామచంద్రుడు పాల్గొన్నారు.