Date of Publish : 29 March 2026, 8:53 pmPosted By : YEDUKONDALU DADALA
తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్
కరప, పెన్ పవర్,మార్చి 29:కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప, నడకుదురు, చీడిగ, స్వామినగర్, ఇంద్రపాలెం గ్రామాల్లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఆశయాలే పార్టీకి మార్గదర్శకాలని, ఆయన బాటలోనే పార్టీ ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో నులుకుర్తి వెంకటేశ్వర రావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర రావు,పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.