సీతానగరం, పెన్ పవర్, మార్చి22 :
గడిచిన రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాజా నగరం నియోజకవర్గంలో కొనసాగుతున్న అవినీతి, దోపిడి , అరాచకాలపై పోరాటానికి సిద్ధం కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతానగరం మండలంలోని ఇనగంటివారిపేట,రఘదేవపురం గ్రామ కమిటీ లు అనుబంధ కమిటీల ఏర్పాటుపై ఆదివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామానికి 114 మంది చొప్పున నియోజకవర్గంలో సుమారు పదివేల మందితో కమిటీలు ఏర్పాటు చేసు కోవడం ద్వారా ప్రతిష్టమైన క్యాడర్ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది అన్నారు.కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింద న్నారు.మూడు పార్టీలు ఏక మైన జనసేన పార్టీ ఆవి ర్భావ దినోత్సవానికి, ఆది వారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు గ్రామాల సమావేశానికి వచ్చిన దాంట్లో సగం మంది కూడా రాకపోవడమే అందుకు నిదర్శనం అన్నారు. 2019 ఎన్నికలకు ముందు రాజానగరం నియోజకవర్గంలో అనుస రించిన కమిటీల నిర్మాణ ప్రక్రియనే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో అనుసరిస్తున్నార న్నారు.పార్టీ 29 అనుబంధ విభాగాలకు, గ్రామస్థాయి లో ఏర్పాటు చేసే 13 కమి టీల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు.

భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు రాజా పిలుపునిచ్చారు. 18-60 లోపు మహిళ లకు నెలకు 1500 ఇస్తా మని, నిరుద్యోగ యువ తకు నెలకు రూ. 3000 వేలు అంటూ హామీలు గుప్పించి గద్దెనెక్కిన కూట మి ప్రభుత్వం హామీలను విస్మరించిందన్నారు. 22 నెలల నుంచి నిరుద్యోగుల కు భృతి చెల్లించకుండా ప్రభుత్వం పబ్బం గడుపు తుందన్నారు. రైతులకు ఎరువులు కావాలంటే క్యూ లైన్ లో నిలబడి సమస్యలు సొమ్మ సిల్లి పడిపోయే పరిస్థితులు దాపురించే అన్నారు.
సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో ప్రచారం ఊదర
కొట్టి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ లు అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన అందరి పైన ఉందన్నారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా ఈ కమిటీల ద్వారా అత్యంత బల మైన క్యాడర్ ను వైయ స్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పా టు చేసుకుందన్నారు. సోషల్ మీడియా వేదిక గా మరోపక్క ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎండగట్టా లని పార్టీ శ్రేణులకు సూచిం చారు. బాధ్యత కలిగిన ప్రతి పక్షంగా ప్రతి విభాగ కమిటీ తమ విభాగాలకు సంబం ధించిన అంశాలపై ప్రభు త్వాన్ని గొంతెత్తి నిలదీయా లని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఐదెంచె ల కమిటీల ఏర్పాటులో ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇచ్చామన్నారు. నెలాఖరులోపు పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం గ్రామాల వారీగా, ప్రతి కమిటీ ఏర్పా టు పై రాజా వ్యక్తిగతంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పిండి రాధాకృష్ణ, చల్లమల్ల సుజీరాజు, పెద్దపాటి డాక్టర్ బాబు, ఎంపీపీ గుర్రాల జోష్న, గంటా శీను, ఎంపీటీసీ కొమ్మిరి శెట్టి వెంకటేశ్వరరావు, తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.