PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 9:51 pm Posted By : SRIKANTH NARASIMHALA

నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో పేకాట స్థావరంపై దాడి

నలుగురు అరెస్ట్

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 22 :

నాదెండ్ల : మండల పరిధిలోని చిరుమామిళ్ల గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం అందిన ముందస్తు సమాచారం మేరకు, నాదెండ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ జె. నిరంజన్, ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.

గ్రామ సమీపంలోని ఎన్ ఎస్ పి కాలువ వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు రూ. 21,000/- నగదు, 3 మోటార్ సైకిళ్లు, మరియు 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు హెచ్చరించారు.