PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 3:20 am Posted By : YEDUKONDALU DADALA

నిందితుడి అరెస్టు – రిమాండ్‌కు తరలింపు

కాజులూరు, పెన్ పవర్,మార్చి 28:
గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు.తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన పాసిల సత్యనారాయణ అలియాస్ సతీష్ (28)ను గొల్లపాలెం–కొంగాడు రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. క్రైం నం.18/2025 కింద బీఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి, ఎస్సై ఎం. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అరెస్టు నిర్వహించారు.అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.కేసు దర్యాప్తు కొనసాగుతోంది.