PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 5:36 pm Posted By : D Ratnam

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

 

అమరావతి, పెన్ పవర్:

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ కొత్త బాధ్యతలను అప్పగించింది.కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఉన్న షణ్మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఎండీగా బదిలీ చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా టి. నిశాంతిని నియమించగా, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా అభిషిక్త్ కిశోర్, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా హరేంద్ర ప్రసాద్‌ను నియమించారు.ఇక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా తమిమిన్ అన్సారియాను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర పరిపాలనలో సమర్థత పెంపొందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.