PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:03 pm Posted By : SRIKANTH NARASIMHALA

పల్నాడు జిల్లా వ్యాపారులు జాగ్రత్త

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడితే జైలు ఖాయం

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24:    

పల్నాడు : వ్యాపార అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సప్లై ఆఫీసర్ ప్రసాద్ హెచ్చరించారు. హోటళ్లు,టిఫిన్ సెంటర్లు,ఇతర వాణిజ్య స్థావరాల్లో కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లు వాడటం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినామని ప్రసాద్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గ్రాహకుల (కస్టమర్లు/ వినియోగదారులు) భద్రత కోసం ఇలాంటి ఉల్లంఘనలను ఖర్చు పెట్టుకుని కట్టడి చేస్తామని ఆయనపేర్కొన్నారు. వ్యాపారులుఅందరూ కమర్షియల్ సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలని, లేకపోతే చట్ట పరమైన చర్యలు ఎదుర్కొంటారని డీఎస్ఓ ప్రసాద్ సూచించారు