- నారా కుటుంబం నుంచి మరో యువ నేత ఎంట్రీకి సిద్ధం
- పోలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్
- నారావారి పల్లెలో కీలక వ్యాఖ్యలు
- రాజకీయాలపై ఆసక్తి ఉందని ఓపెన్ స్టేట్‌మెంట్
- తండ్రి Nara Ramamurthy Naidu వారసత్వం కొనసాగింపు?
- Nara Chandrababu Naidu కుటుంబ మద్దతు కీలకం
- లోకేష్ నాయకత్వానికి బలంగా నిలిచే అవకాశాలు
- 2024 ఎన్నికల్లో టిడిపి కోసం ప్రచారం చేసిన రోహిత్
- చంద్రగిరి నుంచి పోటీపై ఊహాగానాలు
- పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ పాత్రకు సంకేతాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తరానికి మార్గం సుగమం అవుతున్న వేళ, నారా కుటుంబం నుంచి మరో యువ నాయకుడు రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సినీ నటుడు Nara Rohith తన పొలిటికల్ ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. Telugu Desam Party అంటే నందమూరి–నారా కుటుంబాలే గుర్తుకు వస్తాయి. పార్టీ స్థాపకుడు N. T. Rama Rao నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణాన్ని, అనంతరం Nara Chandrababu Naidu దశాబ్దాల పాటు ముందుకు నడిపించారు. ప్రస్తుతం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా Nara Lokesh ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో నారా కుటుంబం నుంచి మరో నాయకుడు రంగంలోకి వస్తాడనే చర్చలు బలపడుతున్నాయి. నారా రోహిత్, మాజీ ఎమ్మెల్యే Nara Ramamurthy Naidu కుమారుడు. తన తండ్రి జయంతి సందర్భంగా నారావారి పల్లెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని స్పష్టం చేశారు.
తిరుపతి, పెన్ పవర్ మార్చి 21:

తెలుగుదేశం పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు నందమూరి, నారా కుటుంబాల వారివి. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకు రాగలిగారు నందమూరి తారక రామారావు. అయితే చంద్రబాబు ఆ పార్టీకి సుదీర్ఘకాలం అధ్యక్షుడిగాను వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు పాత్ర మరువరానిది. అయితే ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనడంలో సందేహం లేదు. తనను తాను ప్రూవ్ చేసుకొని ముందుకు సాగుతున్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీని అనధికారిక అధ్యక్షుడిగా కొనసాగుతూ.. పార్టీని సమన్వయం చేసుకోవడమే కాదు బలోపేతం చేయడంలో లోకేష్ ముందుంటున్నారు. అదే సమయంలో నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు నారా కుటుంబం నుంచి మరో యువ నేత రంగంలోకి వస్తారని ప్రచారం నడుస్తోంది. సినీ నటుడు నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు బలం చేకూరుస్తూ ఆయన సైతం ఫుల్ క్లారిటీ ఇచ్చారు.చంద్రబాబు నాయుడుసోదరుడిగా రామ్మూర్తి నాయుడు ఉండేవారు. ఆయన ఒకసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. చాలా రోజులపాటు అనారోగ్యంతో బాధపడుతూ గత ఏడాది చనిపోయారు రామ్మూర్తి నాయుడు. ఆయన కుమారుడే నారా రోహిత్. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అయితే ఇంతవరకు ఆయనకు సినిమా రంగంలో సరైన బ్రేక్ తగలలేదు. మొన్ననే వివాహం చేసుకొని ఒక ఇంటి వాడు అయ్యాడు. అయితే తనకు రాజకీయ ఆసక్తి ఉందని తాజాగా వెల్లడించాడు. నారా రామ్మూర్తి నాయుడు జయంతి వేడుకలు ఆయన సొంత గ్రామం నారావారి పల్లెలో జరిగాయి. తండ్రికి నివాళులు అర్పించేందుకు నారా రోహిత్ వెళ్లారు.

పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే.. కచ్చితంగా ఉంటుందని ఆయన చెప్పారు. తనకు రాజకీయాలు అంటే ఇష్టంగా పేర్కొన్నారు. సరైన సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు.నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యానికి గురికావడంతో నారా రోహిత్ బాధ్యతలను ఎక్కువగా చంద్రబాబు చూసుకున్నారు. ఆయన పొలిటికల్ గా బిజీగా ఉండడంతో పెద్దమ్మ భువనేశ్వరి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొన్న రోహిత్ వివాహంలో కూడా భువనేశ్వరి అన్ని తానై వ్యవహరించారు. పెదనాన్న చంద్రబాబు, సోదరుడు లోకేష్ తో రోహిత్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతుగా రోహిత్ ప్రచారం కూడా చేశారు. లోకేష్ తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటే కుటుంబ పరంగా ఆయనకు మద్దతు అవసరం. అందుకే నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన చంద్రగిరి నుంచి బరిలో దిగుతారని నారా అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లోనే కాకుండా పార్టీ పరంగా కూడా నారా రోహిత్ సేవలను టిడిపి నాయకత్వం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. పెదనాన్న చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం టిడిపిలో యాక్టివ్ అయ్యేందుకు నారా రోహిత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.