PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 6:00 pm Posted By : SRIKANTH NARASIMHALA

పాస్టర్లకు ఇంటిస్థలాల అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తాను : ప్రత్తిపాటి

  • కూటమిప్రభుత్వం పాస్టర్లకు రూ.5వేల గౌరవ వేతనం అందిస్తోంది.
  • క్రైస్తవ సమాజ హితానికి, క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాశయంలో పాస్టర్లు భాగస్వాములు కావాలి.
  • పేదరికం లేని సమాజ నిర్మాణానికి తమవంతు సహాయసహకారాలు అందించాలి.
  • ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ వార్షిక సర్వసభ్య సమావేశంలో మాజీమంత్రి ప్రత్తిపాటి.

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24 :

చిలకలూరిపేట : కూటమిప్రభుత్వం క్రైస్తవ సమాజ హితానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, క్రైస్తవుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తోందని, పాస్టర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

పట్టణంలోని దివ్యశాంతి నిలయంలో ప్రముఖ దైవజనులు నందమూరి క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ వార్షిక సర్వసభ్య సమావేశం -2026కు ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాశయం అయిన పేదరికం లేని సమాజ నిర్మాణంలో క్రైస్తవ మతబోధకులు భాగస్వాములు కావాలని ప్రత్తిపాటి సూచించారు. పాస్టర్లకు ప్రభుత్వం ప్రతినెలా రూ.5వేల గౌరవ వేతనం అందిస్తోందని, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రభువు సేవలో తరించే ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులేనని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.

నియోజకవర్గంలోని పాస్టర్లకు ఇంటిస్థలాలు అందచేయడంపై ప్రభుత్వంతో చర్చిస్తాను

పాస్లర్లు ఎప్పటినుంచో ఇళ్లస్థలాలు కావాలని కోరుతున్నారని, నియోజకవర్గంలోని పాస్టర్ల తరపున సమస్యపై ప్రభుత్వంతో చర్చించి, దీనికి పరిష్కారమార్గం చూస్తానని ఈ సందర్భంగా ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి ఇంటి స్థలం లేని పేదలకుఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వడానికి సిద్ధమైందని, అదే జాబితాలో పాస్టర్లకు కూడా ఇళ్లస్థలాలు అందించేందుకు కృషి చేస్తామని ప్రత్తిపాటి తెలిపారు. ప్రభువు బోధనలు, ఆయన సూచించిన శాంతి, ప్రేమ మార్గాన్ని ప్రతి క్రైస్తవుడు/క్రైస్తవురాలు తప్పకుండా ఆచరించాలని ప్రత్తిపాటి సూచించారు.

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, జాకోబు రాజు, టీడీపీ నాయకులు, పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.