PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:39 pm Posted By : YEDUKONDALU DADALA

పిఠాపురం,గొల్లప్రోలు క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పర్యటన

పిఠాపురం/గొల్లప్రోలు, మార్చి 23:

పిఠాపురం పట్టణం మరియు గొల్లప్రోలు నగర పంచాయతీలో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల పనులను స్వయంగా పరిశీలించారు. పిఠాపురం పర్యటనలో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ బీహెచ్ భవానీ శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు మరియు స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.ఈ సందర్భంగా పిఠాపురం పట్టణంలోని పలు వార్డుల్లో శానిటేషన్, డ్రైనేజీ నిర్వహణను మంత్రి స్వయంగా పరిశీలించి, పనుల నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. మాధవపురం డంపింగ్ యార్డ్‌ను సందర్శించి చెత్త సేకరణ, తరలింపు, చెత్త ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
అనంతరం గొల్లప్రోలు నగర పంచాయతీలో బస్టాండ్ సమీపంలోని సూరిడు చెరువు, సూరంపాలెం బ్రిడ్జ్, రంగంపాడు చెరువు తదితర ప్రదేశాలను మంత్రి పరిశీలించి, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.ఈ కార్యక్రమంలో పిఠాపురం కమిషనర్ ఎన్. కనకారావు, గొల్లప్రోలు కమిషనర్ పీ. శ్రీనివాసు, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ,గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్, శానిటేషన్ మరియు ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.