PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 5:35 pm Posted By : SOMA RAJU GUMMIDI

పెట్రోల్ బంక్ పక్కనే స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది

విశాఖపట్నం టౌన్‌లోని కొత్తరోడ్డు సమీపంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న స్క్రాప్ షాప్ గోడౌన్‌లో అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్షణాల్లోనే మంటలు ఎగసిపడి ఆ ప్రాంతమంతా మంటలతో కమ్ముకు పోయింది. గోడౌన్‌లో నిల్వ ఉంచిన వ్యర్థ లో హాలు, ప్లాస్టిక్ సామ గ్రి కారణంగా మంటలు మరింత వేగంగా వ్యాపించా యి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడం తో సమీప ప్రాంత ప్రజలు భయాం దోళనలకు గురయ్యారు.ఈ ప్రమాదంలో అత్యంత ఆందోళనకర విష యం ఏమిటంటే, గోడౌన్‌కు అతి సమీపం లోనే పెట్రోల్ బంక్ ఉండటం. దీంతో భారీ ప్రమాదం సంభవించే అవకాశముందని స్థానికులు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తు. న్నారు. ప్రస్తుతం పరిస్థితి నియం త్రణలోకి తీసుకురా వడానికి చర్యలు కొనసాగు తున్నాయి.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.