PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 6:38 pm Posted By : D Ratnam

పోలవరం జిల్లా నూతన కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీటీఏ నాయకులు

 

గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 30:

నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు మొట్టమొదటి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కె. దినేష్ కుమార్ ని బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బీటీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు బోండ్ల ప్రసాద్ , జిల్లా అధ్యక్షులు ఎం.రాజేశ్వరరావు , జిల్లా కార్యదర్శి వంతల చిన్నారావు కలెక్టర్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో విద్యా రంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యలు, పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాలపై కలెక్టర్ దృష్టి సారించాలని వారు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.