PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:14 pm Posted By : M CHANTI BABU

ప్రజా సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా టిడిపి పయనం:దేవరపల్లి సర్పంచ్ సిరిబాల బుజ్జిబాబు

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 29: ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమం–అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజా సేవలో ముందంజలో ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని దేవరపల్లి సర్పంచ్ సిరి బాల బుజ్జిబాబు పేర్కొన్నారు. దేవరపల్లి పంచాయతీ కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.