ఉత్సాహంగా స్వీట్లు పంపిణీ – ఎన్టీఆర్ ఆశయాల సాధనకు పిలుపు
కాజులూరు, పెన్‌పవర్, మార్చి 29:
మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. గొల్లపాలెం–కాజులూరు సెంటర్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు చుండ్రు వీర్రాజు చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి,కేక్ కట్ చేసి, “ఎన్టీఆర్ జోహార్” నినాదాలతో ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో భాగంగా కోటిపల్లి–ద్రాక్షారామం ప్రధాన రహదారిపై వెళ్లే బాటసారులు, వాహన దారులకు తెలుగు యువత ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వీర్రాజు చౌదరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు.1982లో ప్రారంభమైన ఈ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు తీసుకువచ్చిందని గుర్తుచేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ముందుకు నడిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
ప్రస్తుతం టీడీపీ నారా లోకేష్ నాయకత్వంలో మరింత బలోపేతమవుతోందని, ప్రజల అభ్యున్నతే పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు.ఇక మండలంలోని మంజేరు, తణుకువాడ,శలపాక,ఆర్యవటం, పెనుమళ్ళ తదితర గ్రామాల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతంచేశారు.ఈకార్యక్రమంలో దాసరిబాబులు,అంగర కృష్ణ,సనపాల ధనరాజు,నల్లం నాగు, కోట తాతబ్బాయి, వడ్లపాటి వెంకటరమణ,చందాల ఆదినారాయణ తో పాటు నక్కా శ్రీను,అంగర శ్రీను,కొప్పిశెట్టి లక్ష్మీనారాయణ,కోక హరిబాబు, వనమాడి శ్రీను,పలివెల రాజు, కురుపూడి గోవిందు,చందాల మల్లిబాబు,అత్తిలి వెంకటరమణ,వల్లు అర్జునరావు,పితాని సతీష్,యర్రంనీడి గోవిందు,దడాల నాగార్జున, సలాది సాయిబాబు, రాముడు,పేపకాయల బాబ్జీ, చెక్కపల్లి సూర్యనారాయణ, సలాది సత్యనారాయణ,కలిదిండి కొండ తదితరులు పాల్గొన్నారు.