కాజులూరు, పెన్ పవర్, మార్చి 27:
కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని తణుకువాడ, డేగలపేట, శలపాక, మంజేరు, గొల్లపాలెం జర్నలిస్టు కాలనీ, పాపయమ్మపేట గ్రామాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.గొల్లపాలెం, పాపయమ్మపేటలోని ప్రసిద్ధ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ రామాలయంలో నిర్వహించిన కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నంది కోళ్ల సుబ్బారావు – సత్యవతి దంపతులు పీటలపై కూర్చొని కల్యాణాన్ని నిర్వహించారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు స్వామివారిని అమ్మవారిని పల్లకిలో గ్రామంలో భక్తులతో “జై శ్రీరామ్” నామస్మరణతో ఘనంగా ఊరేగించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణం వైభవంగా జరిగింది.
కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించారు.సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహోత్సవాన్ని తిలకించారు.గొల్లపాలెం పాపయమ్మపేటలో నూతనంగా నిర్మించిన రామాలయానికి మొగలిపాలెం గ్రామస్తులు,శలపాక నీటి సంఘం అధ్యక్షులు తాడి రామారెడ్డి ఆధ్వర్యంలో గ్రానైట్ టైల్స్ వేయించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.గత నాలుగేళ్లుగా రాములవారి కల్యాణం విజయవంతంగా కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దాసరి వీర వెంకట సత్యనారాయణ (బాబులు), గొల్లపాలెం సొసైటీ అధ్యక్షులు అంగర కృష్ణ, బుర్రె ఆనందరావు, బుర్రె రవి, వార్డు మెంబర్ అంగర శ్రీనివాసు, బుర్రె దేవిశంకర్, మట్టా రాధాకృష్ణ, బుర్రె సంజయ్ కుమార్, అత్తిలి వెంకటరమణ, మట్టా శ్రీనివాస్, మట్టా వెంకటేష్, వెలగ విజయ్, రేలంగి రాజు, కొండబాబు, చిట్నీడి సత్తిరాజు, ఎన్. ప్రసాద్, మట్టా గోవిందు తదితరులు పాల్గొన్నారు.
అలాగే గొల్లపాలెం జర్నలిస్టు కాలనీలో కూడా రాములవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.
తణుకువాడ, డేగలపేట, శలపాక, మంజేరు తదితర గ్రామాల్లోనూ సీతారాముల కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమాల్లో తణుకువాడ గ్రామ సర్పంచ్ నరాల సుబ్బరాజు, వల్లు అర్జున్, పితాని సతీష్, ప్రముఖ పారిశ్రామికవేత్త తాడి రామారెడ్డి, డీసీ కృష్ణ చైతన్య,డేగల సత్యనారాయణ మూర్తి, మాధవరపు దొరబాబు,పబ్బినీడి సూరిబాబు, సబ్బినీడి శ్రీనివాస్ చౌదరి,జనసేన డేగల సతీష్,రామిరెడ్డి చక్రరావు,సూరంపూడి కృష్ణ (భాను), చుండ్రు రుద్రాచౌదరి, చుండ్రు వీర్రాజు చౌదరి,జక్కన రాజేష్,ఏఎంసీ వైస్ చైర్మన్ దడాల నాగేశ్వరి నాగార్జున, ఎంపీటీసీ దడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో కల్యాణోత్సవాలను తిలకించారు.