- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ ఢీ… క్షణాల్లో మంటలు
- 40 మందితో ప్రయాణం… విషాదంగా మారిన ప్రయాణం
- ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
- క్వారీ ప్రాంతంలో విషాదం
- ఢీకొన్న వెంటనే అగ్నిజ్వాలలు
- తప్పించుకోలేని ప్రయాణికులు
- 40 మంది ప్రయాణం… 10 మంది మృతి
- 20 మందికి పైగా గాయాలు
- ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగింపు
- సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- రాత్రి ప్రయాణాల్లో భద్రతపై ప్రశ్నలు
- ప్రమాదానికి కారణాలపై అనుమానాలు
మార్కాపురం, పెన్ పవర్, మార్చి 26:

మార్యాపురంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని ఢీకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పది మంది సజీవ దహనం అయ్యారు. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు, లారీ పూర్తిగా దగ్ధమైయ్యాయి. నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతు్వొ. ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి :
ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.