సీతానగరం, పెన్ పవర్, మార్చి 8 :
సీతానగరం మండలకేంద్రంలో కొలువైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకుడు గద్దె వెంకటకృష్ణ (నల్లి) తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన మేనమామ పెండ్యాల కుటుంబ సభ్యులతో కలిసి రూ. 1.63 లక్షల విరాళంతో ఆలయ ప్రాంగణంలో టైల్స్ వేయించి, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. గతంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు నడవడానికి ఇబ్బందిగా ఉండేదని, ప్రస్తుతం సుందరంగా తీర్చిదిద్దిన టైల్స్ మార్గం వల్ల అమ్మవారిని దర్శించుకోవడం సులభతరమైందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ రూపురేఖలు మార్చిన వెంకటకృష్ణ బృందాన్ని ఈ సందర్భంగా భక్తులు అభినందించారు. కేవలం ఆధ్యాత్మిక పనులే కాకుండా, వెంకటకృష్ణ విద్య, వైద్య రంగాల్లోనూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల సీతానగరం ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను విరాళంగా అందజేశారు.

అలాగే నిరుపేద విద్యార్థుల చదువుల కోసం నిరంతరం తనవంతు సహాయం అందిస్తున్నారు. దేవాలయ అభివృద్ధికి ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందజేసిన గద్దె వెంకటకృష్ణను, పెండ్యాల కుటుంబీకులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల అవసరాలను గుర్తిస్తూ, సేవా దృక్పథంతో ఆయన ముందుకు సాగడం పట్ల నియోజకవర్గ ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.