PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 10:49 am Posted By : PEN POWER MEDIA

ముద్రగడకు నో చెప్పిన జగన్…!

 

  • పార్టీ మార్పులు – విమర్శలకు దారితీసిన నిర్ణయాలు
  • ఎన్నికల ముందు వైసీపీలో చేరిక
  • పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ సవాల్
  • పిఠాపురం ఫలితాలు – ప్రతిష్టకు దెబ్బ
  • వైసీపీ ఇచ్చిన పబ్లిక్ అడ్వైజరీ కమిటీ స్థానం
  • గోదావరి జిల్లాల బాధ్యతలపై కొత్త డిమాండ్
  • వైసీపీలో అంతర్గత విభేదాలు
  • జనసేన ప్రభావం – జగన్ ఆలోచనలో మార్పు
  • ముద్రగడ భవిష్యత్తు – తదుపరి అడుగు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే పరిణామంగా భావిస్తున్న ఈ సంఘటనలో, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చేసిన తాజా డిమాండ్‌కు  జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలు కోరిన ముద్రగడకు జగన్ ‘నో’ చెప్పినట్లుగా సమాచారం రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

కాకినాడ,  పెన్ పవర్,  మార్చి 23: 

రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభానిది ప్రత్యేక స్థానం. 1978లోనే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి తో పాటు అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ రాజకీయంగా స్థిరత్వం ఉండదన్న విమర్శ ఆయనపై ఉంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ టిడిపి నాయకత్వంతో విభేదించి కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి బిజెపి.. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని భావించారు. వీలుకాకపోయేసరికి వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు కొత్త డిమాండ్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది. కానీ జగన్ మాత్రం ఆలోచనలో పడినట్లు సమాచార ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కోసం గట్టిగానే పనిచేశారు. ఏకంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అలా చేయకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే ముద్రగడ పద్మనాభం పెద్దరికాన్ని గౌరవించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ అడ్వైజరీ కమిటీలో ఆయనకు స్థానం ఇచ్చారు. అయితే ఈ కమిటీ టిడిపి పోలిట్ బ్యూరో మాదిరిగా కాదు. పెద్దగా అధికారాలు కూడా ఉండవు. అందుకే తనకు పార్టీలో పెద్ద పదవి ఇవ్వాలని ముద్రగడ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నట్లు తెలుస్తోంది.ముద్రగడ పద్మనాభం ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలను తనకు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఆయనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది విభేదిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడో పాతకాలపు రాజకీయాలు అనుసరిస్తుంటారు ముద్రగడ పద్మనాభం. అందుకే పెద్దగా ఎవరికీ నచ్చరు. ఏ కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు అదే కాపులు ఇప్పుడు ఆయనను నమ్మేస్థితిలో లేరు. మరోవైపు గోదావరి జిల్లాలో జనసేన ప్రభావం అధికంగా ఉంది. ఇటువంటి సమయంలో ముద్రగడ పద్మనాభం కు ఉపయోగ గోదావరి జిల్లాల బాధ్యతలు ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే జగన్ ఆ పదవి ఇచ్చేందుకు అంగీకరించరు. మరోవైపు చూస్తే ముద్రగడ తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయోభారంతో ఇబ్బందులు ఉన్నాయి. అయితే జగన్ ఇప్పుడు పదవి ఇవ్వకపోతే ముద్రగడ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి.