గంగవరం, పెన్ పవర్ మార్చి 29 :
గంగవరం మండలం మోహనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, నాయకులు మరియు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
కార్యక్రమంలో రైతు అధ్యక్షులు ఎం. శివరామ భూపతి దేవ్ మాట్లాడుతూ, టీడీపీ పార్టీ స్థాపన నుంచి ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించిందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.మోహనాపురం టీడీపీ సీనియర్ కార్యకర్త బుర్రె రాంబాబు, బూత్ ఇంచార్జ్ బొగ్గుల సత్తిబాబు, పేసా సెక్రటరీ కోసం సూరిబాబు తదితరులు పాల్గొని పార్టీ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా సూచించారు
ఈ వేడుకల్లో మోహనాపురం మరియు పండ్రపోలు పంచాయతీలకు చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. .