PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 4:19 pm Posted By : D Ratnam

యధావిధిగా ‘మీకోసం’ – రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు స్వీకరణ

స్టాప్ రిపోర్టర్ రంపచోడవరం, పెన్ పవర్, మార్చి 29:
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ (PGRS) మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను మార్చి 30న యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.

సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. రంపచోడవరం పీఓ ఐటిడిఎ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌కు ఆర్డీవోలు, తహశీల్దార్లు మరియు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారని పేర్కొన్నారు.

ప్రజలు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉందని, అలాగే 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అర్జీలు సమర్పించడంతో పాటు వాటి స్థితి గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.

‘పీపుల్స్ ఫస్ట్’ ధోరణిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ చెప్పారు. అదనంగా, పౌర సేవలను మరింత సులభతరం చేయడానికి 95523 00009 వాట్సాప్ నెంబర్ ద్వారా సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.