PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 3:07 pm Posted By : PEN POWER MEDIA

రాత్రి నిద్ర లేక ఇబ్బందిపడుతున్నారా?

  • మహిళల్లో నిద్రలేమి పెరుగుతున్న సమస్య
  • హార్మోన్ల అసమతుల్యత – ప్రధాన కారణం
  • ఈస్ట్రోజన్ పాత్ర – సెరటోనిన్ & శరీర ఉష్ణోగ్రత నియంత్రణ
  • ప్రొజెస్టరాన్ – మెదడు ప్రశాంతతకు కీలకం
  • మెలటోనిన్ – జీవ గడియారం & నిద్ర నియంత్రణ
  • కార్టిసాల్ – ఒత్తిడి & నిద్రపై ప్రభావం
  • టెస్టోస్టెరాన్ & రెమ్ నిద్ర సంబంధం
  • థైరాయిడ్ హార్మోన్లు & జీవక్రియ ప్రభావం
  • జీవనశైలి మార్పులు – నిద్ర మెరుగుపరచే అలవాట్లు
  • వైద్య సలహా – అవసరమైనప్పుడు చికిత్స & సప్లిమెంట్లు

 

రాత్రి పడుకున్నా నిద్ర పట్టకపోవడం, మధ్యలో మెలకువ రావడం ఇప్పుడు చాలా మహిళల్లో సాధారణ సమస్యగా మారింది. జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళనలతో పాటు హార్మోన్ల అసమతుల్యత ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌, మెలటోనిన్‌, కార్టిసాల్ వంటి హార్మోన్ల మార్పులు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. సరైన అలవాట్లు పాటించడం ద్వారా నిద్ర సమస్యలను నియంత్రించవచ్చు.

పెన్ పవర్ హెల్త్ డెస్క్ : 

చాలా మహిళలు రాత్రి సమయానికి పడుకున్నా సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. నిద్రలోకి వెళ్లిన తర్వాత కూడా మధ్యలో మెలకువ రావడం సాధారణమైపోయింది. జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళనలతో పాటు హార్మోన్ల అసమతుల్యత కూడా దీనికి ముఖ్య కారణాలు. ఇటీవల కాలంలో చాలా మందికి రాత్రిపూట నిద్రపట్టదు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. దీనికి జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆందోళనలతో పాటు హార్మోన్ల అసమతుల్యత కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మహిళల శరీరం పురుషులతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది. నెలసరి, గర్భధారణ, మెనోపాజ్‌ ‌వంటి దశల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్‌, ‌ప్రొజెస్టరాన్‌ ‌స్థాయిల్లో వచ్చే మార్పులు నిద్రపై ప్రభావం చూపుతాయి. ఈస్ట్రోజన్‌ ‌నిద్రకు సహాయపడే సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. కానీ, నెలసరి లేదా మెనోపాజ్‌ ‌సమయంలో దీని స్థాయి తగ్గితే వేడి అలికిడి, చెమటలు పెరిగి నిద్ర భంగం కలుగుతుంది. ప్రొజెస్టరాన్‌ ‌మెదడును ప్రశాంతంగా ఉంచే హార్మోన్‌. ‌లూటియల్‌ ‌దశలో, గర్భధారణ సమయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో ఎక్కువగా నిద్రగా అనిపిస్తుంది. కానీ నెలసరి ముందు, ప్రసవం తర్వాత దీని స్థాయి తగ్గిపోతే నిద్రలేమి సమస్య వస్తుంది. మెలటోనిన్‌ ‌నిద్రను నియంత్రించే ప్రధాన హార్మోన్‌. ఇది మన జీవ గడియారం (సర్కేడియన్‌ ‌రిథమ్‌)‌ను క్రమబద్ధం చేస్తుంది. నిద్ర సమయాలు క్రమంగా పాటించకపోతే దీని ఉత్పత్తి తగ్గి నిద్ర సమస్యలు వస్తాయి. కార్టిసాల్‌ ఒత్తిడికి సంబంధించిన హార్మోన్‌. ఇది రాత్రివేళల్లో తగ్గాలి. కానీ ఒత్తిడి ఎక్కువైతే ఇది పెరిగి నిద్రను దెబ్బతీస్తుంది.టెస్టోస్టెరాన్‌ ‌మహిళల్లో కూడా ఉంటుంది. ఇది నిద్రలోని రెమ్‌ ‌దశలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని లోపం కూడా నిద్రాభంగానికి దారితీస్తుంది.థైరాయిడ్‌ ‌హార్మోన్‌ ‌జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఇందులో మార్పులు వచ్చినా నిద్రపై ప్రభావం పడుతుంది.నిజానికి నిద్ర, హార్మోన్లు పరస్పరం అనుసంధానంగా ఉంటాయి. ఒకటి సరిగ్గా లేకపోతే మరొకటి ప్రభావితమవుతుంది. కాబట్టి కొన్ని అలవాట్లు మార్చుకోవడం అవసరం.ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవాలి. ధ్యానం, యోగా, వ్యాయామం చేయాలి. నిద్రకు గంట ముందు మొబైల్‌, ‌టీవీ వాడకం మానేయాలి.సాయంత్రం తర్వాత టీ, కాఫీ తగ్గించాలి.మెగ్నీషియం ఉన్న ఆకుకూరలు, నట్స్, ‌గింజలు తీసుకోవాలి.పడకగదిని చల్లగా ఉంచుకోవాలి. ఇన్ని పాటించినా నిద్ర సమస్య కొనసాగితే, వైద్యుల సలహాతో మెలటోనిన్‌ ‌సప్లిమెంట్లు లేదా అవసరమైన చికిత్సలు తీసుకోవచ్చు.

 

నిద్ర మెరుగుపరచే చిట్కాలు

  • ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం
  • యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం
  • నిద్రకు ముందు మొబైల్‌, టీవీ వాడకం తగ్గించడం
  • సాయంత్రం తర్వాత టీ, కాఫీ తగ్గించడం
  • మెగ్నీషియం ఉన్న ఆహారం తీసుకోవడం (ఆకుకూరలు, గింజలు)
  • పడకగదిని చల్లగా, ప్రశాంతంగా ఉంచడం

ఇన్ని పాటించినా సమస్య కొనసాగితే, వైద్యుల సలహాతో మెలటోనిన్‌ సప్లిమెంట్లు లేదా అవసరమైన చికిత్సలు తీసుకోవడం మంచిది.