PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 4:33 pm Posted By : SIVA KUMAR LANKA

రెండు రోజులపాటు నర్సీపట్నం టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రెండు రోజులపాటు నర్సీపట్నం టౌన్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-సిఐ గఫూర్

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నంలో శ్రీ శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిఐ గఫూర్ తెలిపారు. మార్చి 31 , ఏప్రిల్ 1( రెండు రోజులు) చింతపల్లి రూట్ లో వచ్చే బస్సులను సిబిఎం కాంపౌండ్ వద్దనే నిలిపివేయడం జరుగుతుందన్నారు. అక్కడి నుండే రాకపోకలు జరుగుతాయన్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు కాపు వీధి, తురకబడి, కొత్త వీధి మీదుగా చెక్కా వారి బంకుకు రూట్ ఇచ్చామన్నారు. అలాగే తుని రూట్లో వచ్చే అన్ని రకాల వాహనాలు టీ జంక్షన్, వై జంక్షన్, కాంప్లెక్స్ వరకు రూట్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా కృష్ణదేవిపేట రూట్ లో వచ్చే బస్సులను మాంటిస్సోరి స్కూల్ వద్ద నిలిపివేయడం జరుగుతుందన్నారు. మిగిలిన కార్లు, ద్విచక్ర వాహనాలు డాక్టర్ సూర్యనారాయణ హాస్పిటల్ రూట్, పోలీస్ స్టేషన్, కాపు వీధి, కొత్త వీధి మీదుగా చెక్కా వారి బంకు వద్ద కలపడం జరుగుతుందన్నారు. అలాగే విశాఖపట్నం నుండి వచ్చే వాహనాలు పెద్దబొడ్డేపల్లి, జోగినాధునిపాలెం, వై జంక్షన్, ఆర్టీసి కాంప్లెక్స్ కు రూట్ ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణంలో వాహనాలు మెయిన్ రోడ్డు పై కాకుండా, సైడ్ రూట్ల లోకి ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుందన్నారు. పట్టణంలో 30, 31, 1వ తారీకు మూడు రోజులపాటు భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. జాతర సమయంలోనూ, స్టేజ్ ప్రోగ్రాములు వద్ద, మద్యం షాపుల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే బ్లూ కోర్టు టీంలు నిరంతరం గస్తీ తిరుగుతాయన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు, జాతరలో పాల్గొనే ప్రజలు పోలీస్ వారి సూచనలను పాటించి సహకరించాలని కోరారు.