వాడమామిడి గ్రామంలో ఏప్రిల్ 2న రీసర్వే భూ హక్కు వాడమామిడి పత్రాల పంపిణీ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 26: జీకే వీధి పంచాయతీ పరిధిలోని వాడమామిడి గ్రామంలో రీసర్వే భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూ హక్కు పత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన రైతులు, గ్రామ స్థాయి మరియు మండల స్థాయి ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.