PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 2:59 pm Posted By : M CHANTI BABU

వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి  

వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి

  • మద్యం తాగి వాహనాన్ని నడిపితే జరిమానా తప్పదు  

గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 21:వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట తీసుకెళ్లాలని ఎస్సై సురేష్ సూచించారు. శనివారం గూడెం కొత్త వీధి మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ.10,000 జరిమానా విధిస్తామని, సీట్ బెల్ట్ ధరించకపోతే రూ.1,000, హెల్మెట్ లేకుండా ప్రయాణించినా తగిన చలానా విధిస్తామని తెలిపారు.అలాగే విద్యార్థులు సెలవులకు వచ్చిన సమయంలో మైనర్లకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రులు మానుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్సై సురేష్ తెలిపారు.