PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 9:07 pm Posted By : Sathish Bede

వీరమహిళలు సేవా స్పూర్తి

బాధిత కుటుంబానికి అండగా జనసేన నాయకులు

చింతూరు పెన్ పవర్ మర్చి 28:

చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎడమ ఉషారాణి కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నిన్న మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటంతో దహన కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం నియోజకవర్గ జనసేన వీరమహిళలు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. దహన ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.3000 సహాయం అందజేశారు. అందులోతీగల కవిత గారు రూ.2000, బి. విశాలక్షి గారు రూ.500, రమణి గారు రూ.500 చొప్పున సహాయం చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ నాయకులు తీగల రవి (ఉపాధ్యక్షులు), కారం దుర్గరావు (ప్రధాన కార్యదర్శి), దోమల భగత్ (సంయుక్త కార్యదర్శి), అలాగే వీరమహిళ తీగల కవిత కలిసి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం సమాజపు బాధ్యత. చిన్న సహాయం అయినా ఒక కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుంది అని పేర్కొన్నారు. దాతృత్వంతో ముందుకొచ్చిన వీరమహిళలను స్థానికులు అభినందించారు. జనసేన మండల కమిటీ నాయకులు కూడా స్పందిస్తూ, అవసరమైనప్పుడు ప్రజలకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. ఈ ఘటన మరింతమంది దాతలు ముందుకు వచ్చి అవసరమైన వారికి సహాయం చేయాలని ప్రేరణనిస్తుంది.