PEN POWER
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 4:08 pm Posted By : PEN POWER MEDIA

వెంకటేశ్ | కళ్యాణ్ రామ్ | అనిల్ రావిపూడి కాంబోకు బ్యానర్ ఫిక్స్

 

  • సంక్రాంతి 2027కు భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రెడీ
  • స్టార్ కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్
  • అనిల్ రావిపూడి నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 
  • షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ నిర్మాణం 
  • జీ స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యం 
  • సంక్రాంతి 2027 రిలీజ్‌పై మేకర్స్ ఫోకస్

ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28:

‌విక్టరీ వెంకటేష్‌, ‌నందమూరి కళ్యాణ్‌ ‌రామ్‌, ‌హిట్‌ ‌మిషన్‌ అనిల్‌ ‌రావిపూడి కొలాబరేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతున్నది. విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌‌నర్లకు కేరాఫ్‌ అ‌డ్రెస్‌ అయిన దర్శకుడు అనిల్‌ ‌రావిపూడి మరోసారి క్లీన్‌గా, అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఈ కొత్త ప్రాజెక్ట్ ‌తీసుకురాబోతున్నాడు. హాస్యం, భావోద్వేగాలు, పండగ వాతావరణం అన్నీ కలిసి ఈ సినిమాను ఒక పర్ఫెక్ట్ ‌సంక్రాంతి ట్రీట్‌గా 2027లో తీసుకొచ్చేందుకు ప్లాన్‌లో ఉన్నాడు డైరెక్టర్‌. ‌ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ ‌దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ‌వర్స్ ‌జరుగుతుండగా.. తాజాగా ఈ సినిమాకు నిర్మాణ సంస్థ ఫిక్స్ అయినట్లు అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చాడు అనిల్‌ ‌రవిపూడి. ‘షైన్‌ ‌స్క్రీన్స్’ ‌బ్యానర్‌పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌ ఇప్పటికే ‘భగవంత్‌ ‌కేసరి’ రీజినల్‌ ‌బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్‌ ‌గారు’ వంటి వరుస విజయాలను అందించింది. సురేష్‌ ‌ప్రొడక్షన్స్, శ్రీ‌మతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు భారీగా పెరిగాయి.