PEN POWER
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 5:49 pm Posted By : SRIKANTH NARASIMHALA

సంకూరి ప్రసాదరావు జ్ఞాపకార్థం : దుస్తుల పంపిణీ

ముఖ్య అతిథిగా హాజరైన ఎడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ

చిలకలూరిపేట, పెన్ పవర్, మార్చి 22 :

ఎడ్లపాడు: సంకూరి ప్రసాదరావు జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా బున్నీ నగర్‌లో “సర్వీస్ విత్ లవ్” సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా లెప్రసీ (కుష్టు వ్యాధి) ప్రభావిత 61 కుటుంబాలకు నూతన దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ మాట్లాడుతూ, కుష్టు వ్యాధి బాధిత కుటుంబాలను సమాజంలో ఒంటరితనానికి గురి చేయకుండా మనలో ఒకరిగా ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ముచ్చు వేళాంగిణి బాబూరావు, దాతలు వజ్రమ్మ, రాజారత్నం, దేవరాజు, దేవయ్య, కోటేశ్వరమ్మ, రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు.