PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 6:58 pm Posted By : YEDUKONDALU DADALA

సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

చలివేంద్రం ప్రారంభంచోడవరంలో
రామచంద్రపురం, పెన్ పవర్ మాఉచితర్చి 27: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు.రామచంద్రపురం రూరల్ పరిధిలోని చోడవరం గ్రామంలో వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత చలివేంద్రాన్ని ఆయన నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మజ్జిగ, తాగునీటిని ప్రజలకు, ప్రయాణికులకు పంపిణీ చేశారు. వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన షాలేం క్రీస్తు ఆరాధన మందిరం,జేజేఎం , ఐఓఎం మినిస్ట్రీస్ నిర్వాహకులను,ఇతర దైవ సేవకులను వాసంశెట్టి సత్యం ప్రత్యేకంగా అభినందించారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆదర్శప్రాయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ కె ఆశా కుమార్,బ్రదర్ కె సంతోష్ కిరణ్, కె జ్యోతి బాబు,ఎం రాజారావు, కె స్వరూప, కె ప్రదీప్ తదితరులు, స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు.వేసవి కాలంలో ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే ఈ చలివేంద్రం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సమాజానికి సేవ చేయాలని, ముఖ్యంగా చలివేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సహకారం, మానవతా విలువలను పెంపొందిస్తాయని ఆయన అన్నారు.