PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 2:59 pm Posted By : PEN POWER MEDIA

సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీ..

  • లింగ నిర్ధారణ వీర్య సాంకేతికత ప్రవేశం
  • దేశీయ జాతుల అభివృద్ధికి ప్రాధాన్యం
  • రాష్ట్రీయ గోకుల్ మిషన్ కీలక పాత్ర
  • ఐదు రాష్ట్రాల్లో వీర్య కేంద్రాల ఏర్పాటు
  • 90 శాతం ఆడ దూడలు పుట్టే ఛాన్స్
  • రైతులకు 70% వరకు రాయితీలు
  • తక్కువ ధరలో డోసుల అందుబాటు
  • భారత్ పశుధన్ యాప్ ద్వారా నమోదు
  • పాడి పశువుల సంఖ్య పెంపు లక్ష్యం
  • పశువైద్యుల ద్వారా సేవల వినియోగం
  1. సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీతో పాడి రైతులకు లాభాల పంట
  2. 90% ఆడ దూడల జననం… పాల ఉత్పత్తి పెంపుకు కొత్త దారి
  3. ఏపీ, తెలంగాణలో సబ్సిడీలతో సాంకేతికత విస్తరణ
  4. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పశుసంవర్ధకానికి మార్గం

 

న్యూస్ డెస్క్ పెన్ పవర్, మార్చి 26:

 

సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీ సాయంతో దేశీయ జాతులకు చెందిన ఎద్దులతో సహా అధిక జన్యు యోగ్యత కలిగిన వాటి నుంచి వీర్యం సేకరించి, కేవలం ఆడ దూడలను మాత్రమే ఉత్పత్తి చేసేలా టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ విధానం మన తెలుగు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం పలు రాయితీలను కూడా అందజేస్తోంది. ఈ విధానంతో 10 శాతం పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.90% వరకు కచ్చితత్వంతో కేవలం ఆడ దూడలను మాత్రమే ఉత్పత్తి చేసే లింగ నిర్ధారణ చేసిన వీర్యం విధానం భారత్ తీసుకొచ్చింది. ఈ వీర్యంతో పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, మగ దూడల జనాభాను కూడా పరిమితం చేసే అవకాశం ఉంది. భారత్‌లో తొలిసారిగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద స్థాపించిన కేంద్రాలు.. దేశీయ పశు జాతుల లింగ నిర్ధారణ చేసిన వీర్యాన్ని విజయవంతంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కేంద్రాలను గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌లలో ఉన్న ఐదు ప్రభుత్వ వీర్య కేంద్రాలలో ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ‘ సెక్స్‌డ్ సెమెన్ టెక్నాలజీ ‘ ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని ద్వారా 90% పైగా ఆడ దూడలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పలు రాయితీలు అందిస్తున్నాయి. ఈ పద్దతి ద్వారా రాష్ట్రంలో 10 శాతం పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్  ద్వారా ఈ పథకం అమలు చేస్తోంది. ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌లో భాగంగా ఈ సాంకేతికతను భారీగా ప్రోత్సహిస్తోంది. ఈ పథకం కింద రైతులకు 70% వరకు రాయితీ లభిస్తుంది. ప్రైవేట్ మార్కెట్‌లో ఒక డోస్ సుమారు రూ. 500 – రూ. 1,300 ఉండగా.. ప్రభుత్వ రాయితీతో రైతులకు కేవలం రూ. 150 కే అందుబాటులో ఉంది.రైతులు తమ పశువులను ‘భారత్ పశుధన్’  యాప్‌లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. 2026 నాటికి రాష్ట్రంలోని 10% పాడి పశువులకు ఈ పద్ధతిలో కృత్రిమ గర్భధారణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.తెలంగాణలోనూ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్  రాష్ట్రీయ గోకుల్ మిషన్  కింద ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. తెలంగాణలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 50%- 70% వరకు రాయితీపై సెక్స్‌డ్ సెమెన్ డోసులను అందిస్తున్నారు. కరీంనగర్, కాసంపల్లి వంటి సెమెన్ స్టేషన్లను ఈ సాంకేతికతకు అనుగుణంగా ఆధునీకరించారు. ఈ సెమెన్ వాడటం వల్ల 90% ఆడ దూడలే పుడతాయని పశుసంవర్ధక శాఖ ధ్రువీకరించింది.పాడి రైతులకు ఉపయోగపడే పాడి పశువుల (ఆడ దూడల) సంఖ్య పెరుగుతుంది. అనవసరమైన మగ దూడల పోషణ భారం తగ్గుతుంది. అధిక దిగుబడినిచ్చే మేలుజాతి ఆవు/ గేదె దూడలను త్వరగా పెంపొందించవచ్చు. గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఒక్కో డోస్ రూ. 1,500 పైనే ఉండేది. ఇప్పుడు మన దేశంలోనే తయారు చేస్తుండటం వల్ల ధరలు భారీగా తగ్గాయి.మీ పశువుకు సెక్స్‌డ్ సెమెన్ వేయాలని అనుకుంటే గ్రామంలోని పశువైద్యుడిని లేదా గోపాలమిత్రను సంప్రదించాలి. దీనికోసం పశువుకు సంబంధించిన ఆధార్  వివరాలు అవసరమవుతాయి.