ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన – ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం
డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి – రైతన్నలకు మార్గదర్శనం
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,మార్చి 23: మండల కేంద్రంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ అభివృద్ధి, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు.మండల వ్యవసాయ అధికారి దాసరి గిరిబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల నేపథ్యంలో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అలాగే తుంపర్ల సేద్యానికి 100 శాతం రాయితీపై పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు.రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మొట్టడం నూకరాజు, వి.వి.ఎస్. ప్రసాద్ (ఆర్గనైజింగ్ సెక్రటరీ), రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.