PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 9:11 pm Posted By : M CHANTI BABU

హుకుంపేటలో ఘనంగా విత్తనాల పండుగ

హుకుంపేట,పెన్ పవర్,మార్చి30:అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో ఇటుకుల పండుగ సందర్భంగా విత్తనాల పండుగను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ అనాది కాలం నుండి వున్నది, కులమతాలకు సంబంధం లేకుండా ప్రతి గిరిజనుడు ఆచారంగా నిర్వహిస్తారని గ్రామ పెద్దలు తెలిపారు.

పండుగలో దేవుడికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలకు పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ దాదాపు ఒక వారం రోజుల పాటు సాగుతుంది. పండుగ సమయంలో గ్రామస్తులు వ్యవసాయ పనులు, కూలి పనుల నుండి దూరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటారు.

ఇవ్వేళ, పండగ చివరి రెండు రోజులు పురుషులు వేటకు వెళ్ళే సంప్రదాయం ఉండేది, కానీ ఇప్పుడు వేటను మానేసి ఇళ్లలో కోడిపల్లెలు కాస్తి పండగను నిర్వహిస్తున్నారు. ఆడవాళ్లు గ్రామం మధ్య రోడ్డుపై తాడు కట్టి వచ్ఛేవారిని పండగ కానుక “తాన్చరి” కోసం ఆపుతారు. పండుగలో దింసా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించబడతాయి.

కార్యక్రమంలో హుకుంపేట పిసా ప్రధాన కార్యదర్శి జన్ని వెంకటరమణ, హుకుంపేట పీసా ప్రెసిడెంట్ కాసుల గోవింద్, వార్డు మెంబర్స్ బడ్నైని నూకరాజు, పండు చిన్న అప్పన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు