సర్పంచ్ సమీడ వెంకట పూర్ణిమ
స్టాప్ రిపోర్టర్ హుకుంపేట ,పెన్ పవర్ మార్చి 28:మండలంలోని హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంత ఆశీల వసూళ్ల హక్కులను 2026–2027 సంవత్సరానికి గాను బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ తెలిపారు.ఈ వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు రూ.5,000 చెల్లించి అర్హత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వేలం కార్యక్రమం 01-04-2026, బుధవారం రోజున హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.వేలంలో గెలుపొందిన వ్యక్తి సంబంధిత అగ్రిమెంట్ నకలును వేలం అనంతరం తప్పనిసరిగా పంచాయతీ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుందని సర్పంచ్ వెల్లడించారు. ఆసక్తి గల వారు నిర్దిష్ట తేదీన హాజరై వేలం పాటలో పాల్గొనాలని కోరారు.