PEN POWER
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 12:49 pm Posted By : PEN POWER MEDIA

11 నగరాల్లో ఈ బస్ సౌకర్యం

  • PM e-Bus Scheme ప్రారంభం
  • 11 నగరాల్లో విద్యుత్ బస్సులు
  • 750 బస్సుల పంపిణీ
  • మౌలిక సదుపాయాల ఏర్పాట్లు
  • RTC సిబ్బందికి శిక్షణ
  • కాలుష్యం తగ్గింపు & ఇంధన పొదుపు
  • వివిధ నగరాల్లో కేటాయింపు
  • ఇప్పటికే ప్రవేశ పెట్టిన 100 బస్సులు
  • కొత్త డిపోలు & ₹129.51 కోట్లు
  • RTC ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య బీమా
  • ఏపీకి 11 నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు
  • పీఎం ఈ-బస్ సేవా పథకం పూర్తి స్థాయి ప్రారంభం
  • విద్యుత్ బస్సుల కోసం 12 డిపోలలో మౌలిక సదుపాయాలు
  • ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకం

ఏపీకి కేంద్రం కింద పీఎం ఈ-బస్ సేవా పథకం ద్వారా 11 నగరాల్లో 750 విద్యుత్ బస్సులు వస్తున్నాయి; కాలుష్యం తగ్గింపు, ఇంధన పొదుపు, సురక్షిత ప్రయాణం కోసం రాష్ట్రంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు ప్రారంభం.

న్యూస్ డెస్క్ పెన్ పవర్, మార్చి 26:

ఏపీకి కేంద్రం నుంచి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. కేంద్రం అందిస్తోన్న పీఎం ఈ-బస్‌ సేవా పథకంలో భాగంగా మొదటి దశలో 11 నగరాల్లో 750 విద్యుత్‌ బస్సులు రాబోతున్నాయని సీఎస్ సాయిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పీఎం ఈ బస్ సేవా ఫథకం పూర్తి స్థాయిలో వినియోగానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే 750 విద్యుత్ బస్సులు రాబోతున్నాయన్నారు సీఎస్ సాయిప్రసాద్. ఈ విద్యుత్ బస్సులకు అవసరమైన ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్రం ఏపీకి పీఎం ఈ బస్ సేవా పథకం కింద 750 బస్సులు కేటాయించిందన్నారు.. వీటిని రాష్ట్రంలోని 11 నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఈ బస్సుల్ని నడిపేందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎస్. రాష్ట్రంలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తే.. ఇంధన పొదుపుతో పాటుగా కాలుష్యం నియంత్రణలో ఉంటుందన్నారు. విద్యుత్ బస్సులకు కావాల్సిన మౌలిక వసతుల కోసం మొత్తం 12 డిపోల పరిధిలో 129.51 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు రవాణాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు. ఈ నిధుల్లో కేంద్రం 60శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తున్నాయ్నారు. ఈ విద్యుత్ బస్సుల్ని విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే తిరుపతిలో 100 విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన బస్సులను పూర్తిగా తొలగించాలని సీఎస్‌ అధికారులకు సూచించారు.మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారందరికి ఎస్‌బీఐ జనరల్‌ హెల్త్‌ ఇన్స్యూరెన్స్పథకం ప్రారంభమైంది. ఆర్టీసీ ఎండీ ఎన్‌.బాలసుబ్రమణ్యం బ్రోచర్, సర్క్యులర్‌ను ఆవిష్కరించారు. ఈ బీమా పథకం ద్వారా ఆకస్మికంగా అనారోగ్య పరిస్థితుల్లో ఉద్యోగులపై ఆర్థిక భారం పడకుండా, మెరుగైన చికిత్స పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు ఎండీ. దీనిలో కూడా రెండు పథకాలు (సాప్‌హైర్‌ క్లాసిక్‌ పాలసీ, సాప్‌హైర్‌ సూపర్‌ టాప్‌అప్‌ పాలసీ) ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ రెండింటిలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఆర్టీసీ ఉద్యోగి, భార్య/భర్త, వారి ఇద్దరు పిల్లలు వైద్యం పొందొచ్చు. ఈ పాలసీలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కవరేజ్‌.. ఒకసారి చేరితే, ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొనసాగించొచ్చు.