PEN POWER
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 12:46 am Posted By : PEN POWER MEDIA

సుపీరియర్ కిరోసిన్ పంపిణీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • కేంద్ర ప్రభుత్వం   గెజిట్ విడుదల చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పి డి ఎస్ ) ద్వారా సుపీరియర్ కిరోసిన్ సరఫరాను కొనసాగించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ఇంధన పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి దృష్ట్యా పేద కుటుంబాలకు వంట అవసరాల కోసం నిరంతర సరఫరా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం చట్టం, 1934 మరియు నియమాలు, 2002 ప్రకారం కేంద్రం ప్రత్యేక పరిస్థితుల్లో మార్పులు, మినహాయింపులు అమలు చేసింది. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 2500 లీటర్ల వరకు నిల్వ పరిమితి పెంచి, సరఫరా వ్యవస్థను మరింత సులభతరం చేసింది

📌 పేదల కోసం కిరోసిన్ సరఫరా కొనసాగింపు
📌 పిడిఎస్ ద్వారా పంపిణీకి కేంద్రం అనుమతి
📌 అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం
📌 పెట్రోలియం చట్టం కింద నిర్ణయం
📌 ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు
📌 రాష్ట్రాలకు నిర్ధిష్ట కోటా కేటాయింపు
📌 వంట అవసరాల కోసం ప్రాధాన్యం
📌 నిల్వ పరిమితి 2500 లీటర్లకు పెంపు
📌 ఆయిల్ కంపెనీలకు సౌలభ్యం
📌 నిరంతర సరఫరా లక్ష్యంగా కేంద్రం చర్యలు

బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్ న్యూ ఢిల్లీ 30:

ప్రజలకు అవసరమైన ఇంధన వనరుల సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పేద మరియు అర్హ కుటుంబాలకు వంట అవసరాల కోసం సుపీరియర్ కిరోసిన్ సరఫరాను కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం  The Gazette of India లో అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిరోసిన్ సరఫరాను రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు నిర్ధిష్ట పరిమితుల్లో కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.

పెట్రోలియం చట్టం, 1934 ప్రకారం కేంద్రానికి ఉన్న అధికారాలను వినియోగిస్తూ, అవసరమైన సందర్భాల్లో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాపై నియంత్రణలు విధించవచ్చని పేర్కొంది. అలాగే పెట్రోలియం నియమాలు, 2002 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో మార్పులు లేదా మినహాయింపులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అధికారాన్ని వినియోగించుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఇంధన వనరుల సరఫరాలో ఉన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, ప్రజలకు నిరంతర సరఫరా కొనసాగించడం అత్యవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పేద కుటుంబాలకు ఎటువంటి అంతరాయం లేకుండా కిరోసిన్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అదనంగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొన్ని షరతులతో 2500 లీటర్ల వరకు నిల్వ పరిమితి పెంచుతూ, సరఫరా వ్యవస్థను మరింత సులభతరం చేసింది.