PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:21 pm Posted By : YEDUKONDALU DADALA

“అంబేద్కర్ అందరివాడు” మహాసభ గోడపత్రిక ఆవిష్కరణ

విజయవంతం చేయాలని మంత్రి సుభాష్ పిలుపు

రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 21: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 26న పిఠాపురం రోడ్డులోని పవర గ్రామంలో నిర్వహించనున్న “అంబేద్కర్ అందరివాడు” జాతీయ మహాసభకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన నాయకుడు కాదని, ఆయన అందరివాడని పేర్కొన్నారు. సమానత్వం,సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి అపారమని కొనియాడారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా విశేష గౌరవం పొందిందని తెలిపారు.జాతీయ మహాసభను విజయవంతం చేయాలని,యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బుర్రా విజయ్ కుమార్, గుత్తుల సాయి,వాసంశెట్టి సత్యం, అక్కల రిశ్వంత్ రాయ్,దడాల నాగార్జున,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.