PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 10:05 pm Posted By : starsrinu1899@gmail.com

అడ్డతీగల సంత మార్కెట్ ‘ఆసీలు’ బహిరంగ వేలం..

 

అడ్డతీగల పెన్ పవర్ ఏప్రియల్ 17; ఈనెల20 తేదీన సోమవారం ఉదయం 11 గంటలకు అడ్డతీగల గ్రామపంచాయతీ కార్యాలయం లో ప్రత్యేక అధికారి ఏ. వి. వి కుమార్ వారి అధ్యక్షతన పంచాయతీ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఈ క్రింది తెలిపిన తేదీలలో ఈ దిగువ ఉదాహరించిన పంచాయతీ తాలూకా సంత మార్కెట్ బహిరంగ వేలంపాటను వేయుటకు తేదీ ఖరారు అయింది. 01 – 04 – 2026 నుండి31 – 03 -2027 ఒక సంవత్సరం కాలంనకు వారపు సంత మరియు రోజువారి ఆసిలు, నిర్ణీత రేట్లపై వసూలు చేసుకొనుటకు, వేలంపాట నిర్ణయము తేదీ 20 – 04 -2026 తేదీన గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాటకు కు నిర్ణయించబడింది. దీనికి షరతులు కూడా గ్రామపంచాయతీ విడుదల చేసింది, ఇందులో భాగంగా పాటదారులు స్థానికులై ఉండి గిరిజన కులస్తులై ఉండవలెను, పాటలో పాల్గొని వారు ముందుగా చెల్లించవలసిన ధారావత్ రూ 5000/- రూపాయలు చెల్లించి పాటలో పాల్గొనవలెను. ఈ అర్హతలు కలిగిన వారు బహిరంగ వేలంపాటకు హాజరు కావచ్చునని ప్రత్యేక అధికారి మరియు అభివృద్ధి అధికారి తెలిపారు.