PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 6:54 pm Posted By : SRIKANTH NARASIMHALA

అమరావతిపై జగన్ చిమ్మే విషపు బొట్టు..తన పతనానికి తానే వేసుకునే మెట్టు : ప్రత్తిపాటి

  • రాజధానికి చట్టబద్ధతతో జగన్.. వైసీపీనేతల రాజకీయ జీవితాలపై నీలినీడలు : ప్రత్తిపాటి
  • పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు అమరావతిని పూర్తిచేస్తే రాజకీయ సన్యాసం తప్పదనే దుష్ప్రచారం : ప్రత్తిపాటి
  • పచ్చకామెర్ల రోగికి పచ్చగా కనిపించినట్టు.. అవినీతి సామ్రాట్ కు ప్రతి చోటా అవినీతే కనిపిస్తుంది : ప్రత్తిపాటి

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 05:

చిలకలూరిపేట :  ప్రపంచం గర్వించే ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ జగన్ … ప్రజా రాజధాని అమరావతిని కరప్షన్ క్యాపిటల్ అని దుష్ప్రచారం చేయడం సీగ్గుచేటు. రాజధాని నిర్మాణంపై జగన్ చిమ్మే ప్రతి విషపు బొట్టు.. తన పతనానికి తానే వేసుకునే మెట్టుగా మారుతుంది. కూటమిప్రభుత్వ రాజకీయ చతురతతో, కేంద్రప్రభుత్వ సహకారంతో అమరావతికి చట్టబద్ధత లభించడం.. రాజధాని నిర్మాణం ఊపందుకోవడం.. ప్రజల ఆశలు, ఆకాంక్షలు సాకారం కానుండటంతో, జగన్ ..వైసీపీనేతలకు తమ రాజకీయ జీవితాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పట్టువదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న సమయానికి అమరావతిని పూర్తిచేస్తే, తమకు రాజకీయ సన్యాసం తప్పదనే జగన్ ముఠా రోజుకో కొత్త దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది. రాజధాని నిర్మాణానికి రూ.2లక్షల కోట్లు అవుతుందని, ప్రజలపై అప్పలభారం పడుతుందని జగన్.. వైసీపీనేతలు పగటికలలు కంటున్నారా? లేక ఆత్మలు చెప్పిన ఆర్థిక శాస్త్ర నిబంధనల ప్రకారం మాట్లాడుతున్నారా? స్వతంత్ర ఆడిట్ సంస్థ, న్యాయ విచారణ విభాగాలు ఏవీ చెప్పకుండా రాజధానితో రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వైసీపీనేతలు ఎలా చెబుతారు? రియల్ స్కామ్ లు.. షెల్ కంపెనీలు.. మనీ లాండరింగ్ లు.. ఈడీ, సీబీఐల కళ్లకు గంతలు కట్టే ఘరానా విద్యల్లో ఎప్పటికీ ఘనాపాటి జగనే అనే పచ్చి నిజాన్ని వైసీపీ నేతలు గ్రహించాలి.

పచ్చకామెర్ల రోగిలా..అవినీతి సామ్రాట్ కు అన్నింట్లో అవినీతే కనిపిస్తుంది.

జగన్ రెండు కళ్లు అనివీతి..దోపిడీ. పచ్చకామెర్ల రోగికి లోకం పచ్చగా కనిపించినట్టు.. అవినీతి సామ్రాట్ జగన్ కు ప్రజా సంక్షేమం..అభివృద్ధి సహా అన్నింటా అవినీతే కనిపిస్తుంది.
ఎడారి, శ్మశానంలో అవినీతి..దోపిడీ ఎలా సాధ్యమో వైసీపీ నేతలే చెప్పాలి? అమరాతి రైతుల ఉద్యమం ప్రభావంతో గత ఎన్నికల్లో ప్రజలు అరగుండు గీసినా… జగన్ ముఠా దుష్ప్రచార పంథా మారలేదు. తమ నాయకుడు .. ఆయన అవినీతి మీడియా అసత్యాల్ని నమ్మి వైసీపీనేతలు మాట్లాడితే.. ప్రజల చేతిలో వారికి మరోసారి భారీ భంగపాటు ఖాయం. ప్రపంచం గర్వించే ప్రజా రాజధాని అమరావతిని స్వాగతిస్తేనే తమకు రాజకీయ మనుగడ అనే సత్యాన్ని వైసీపీ నేతలు గ్రహించాలి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఆదివారం ఒక ప్రకటనలో హితవు పలికారు.