PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 8:07 pm Posted By : M CHANTI BABU

అల్లూరి జిల్లాలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

స్టాఫ్ రిపోర్టర్, పాడేరు పెన్ పవర్ ఏప్రిల్ 11:అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిషాంతి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్యకు పునాది వేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. విద్యా ప్రాముఖ్యతను గుర్తించి కుల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ముఖ్యంగా ఆడపిల్లల విద్య కోసం ఆయన చూపిన చైతన్యం నేటి సమాజానికి ఆదర్శమని అన్నారు. సత్యశోధక్ సమాజ్ ద్వారా అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచిన గొప్ప సామాజిక సంస్కర్తగా పూలే నిలిచారని గుర్తు చేశారు.పూలే దంపతులు వేసిన మార్గాన్ని అనుసరిస్తూ, సమాజంలోని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని కలెక్టర్ నిషాంతి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి పిఆర్ఓ, కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. నీలకంఠ రావు, బీసీ వెల్ఫేర్ అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాద్ రావు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ రావు, డివిజనల్ పవర్ సంబంధాల అధికారి కె. వెంకటరావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.