PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 5:35 pm Posted By : M CHANTI BABU

అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తిరుమాని శ్రీపూజ

స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,ఏప్రిల్ 11:అల్లూరి సీతారామరాజు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా తిరుమాని శ్రీపూజ శనివారం స్థానిక కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎస్ అధికారుల ప్రమోషన్లు, బదిలీల్లో భాగంగా ఆమెను ఈ పదవికి నియమించింది. ఇంతకు ముందు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేసిన ఆమెకు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.బాధ్యతల స్వీకరణకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జ్ రెవెన్యూ అధికారి, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి. నీలకంఠరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్‌రావు, సూపరింటెండెంట్ లక్ష్మణరావు తదితరులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.పదవి స్వీకరించే ముందు తిరుమాని శ్రీపూజ కుటుంబ సమేతంగా మోదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యాచార్యులు వారికి పసుపు, కుంకుమ, అక్షింతలతో ఆశీర్వదించారు. అనంతరం ఐటిడిఏ కార్యాలయానికి వెళ్లి ప్రాజెక్ట్ అధికారి బాధ్యతలను నూతనంగా నియమితులైన ఆదిత్య వర్మకు అప్పగించి, అక్కడి నుండి కలెక్టరేట్‌కు చేరుకుని జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆమె, గతంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు.ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం సాధించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ ఏవో, సమాచార శాఖ డివిజనల్ పౌర సంబంధాల అధికారి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.