PEN POWER
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 9:29 am Posted By : Sathish Bede

ఆంధ్రుల రాజధాని అమరావతి కూటమి నేతల సంబరాలు

అమరావతి అజేయం చింతూరులో సంబరాలు

చింతూరు, పెన్ పవర్ ఏప్రిల్ 2:

రాష్ట్రానికి ఒకే రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా చింతూరు మండల కేంద్రంలో కూటమి నాయకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని, ఇకపై అమరావతి అజేయంగా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్, ఇందిరా, రాజీవ్ సెంటర్ల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చుతూ, కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమరావతి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రధానమంత్రి, హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షుడు ఎండి జహంగీర్, ఇల్లా చిన్నారెడ్డి, ఓ రామారావు చౌదరి, మార్కెట్ కమిటీ సభ్యుడు పి సాలమన్ రాజు, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఓ నరసింహారావు, జనసేన నాయకులు పేయ్యాల నాగేశ్వరరావు,జనసేన ప్రధాన కార్యదర్శి బేడే సతీష్, మహిళా మండల అధ్యక్షురాలు మంగవేణి, ఎస్టి సెల్ అధ్యక్షుడు తుర్రం ముత్తయ్య, కట్ట శంకర్, ఎండి రియాజ్, జగదీష్, ఎస్.కే. జానీ, బిజెపి మండల అధ్యక్షుడు బట్ట లక్ష్మణరావు, చిట్టిబాబు తదితరులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.