PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 8:42 am Posted By : D Ratnam

ఇంధన సరఫరా సజావుగానే ఉంది – ప్యానిక్‌కు అవసరం లేదు: కలెక్టర్ దినేష్ కుమార్

 

గంగవరం /రంపచోడవరం, (పెన్ పవర్):
పోలవరం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎలాంటి ఇంధన కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ప్యానిక్‌కు గురికావద్దని, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకునే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు.

ఇంధన సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా కొనసాగించేందుకు సంబంధిత శాఖలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎక్కడైనా పెట్రోల్ లేదా డీజిల్ అందుబాటులో లేకపోవడం, సరఫరాలో ఆలస్యం వంటి సమస్యలు గమనించిన పక్షంలో వెంటనే 77028 31559 నంబర్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

జిల్లా వ్యాప్తంగా సరఫరా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.