PEN POWER
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 4:19 pm Posted By : Sathish Bede

ఉద్యోగుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 25:

చింతూరు డివిజన్ పరిధిలో ఉద్యోగుల కోసం నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్, 2026 సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతూరులో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వారీగా జట్లు ఏర్పాటు చేయాలి. ప్రతి జట్టులో 16 మంది సభ్యులు ఉండాలి. జట్టులో చింతూరు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది. ప్రతి జట్టు నుంచి ప్రవేశ రుసుము వసూలు చేయబడుతుంది. డిపార్ట్మెంట్ పేరుతో పాటు 16 మంది క్రీడాకారుల వివరాలను గ్రూప్‌లో పోస్టు చేయాలి. ప్రతి జట్టుకు సొంత క్రీడా కిట్ తప్పనిసరిగా ఉండాలి. అన్ని మ్యాచ్‌లు వైట్ లెదర్ బాల్‌తో నిర్వహించబడతాయి. ప్రతి జట్టుకు డ్రెస్ కోడ్ అనుసరించడం తప్పనిసరి. టోర్నమెంట్‌కు సంబంధించి జట్టు నమోదు ప్రక్రియను ఈ నెల 28.04.2026 (మంగళవారం) లోపు పూర్తి చేయాలి. అనంతరం 29.04.2026 (బుధవారం) నాటికి టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు తమ వంతు ఆర్థిక సహాయం, సహకారం అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ సమావేశంలో చింతూరు డివిజన్‌కు చెందిన నాలుగు మండలాల వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం క్రింది నంబర్లను సంప్రదించవచ్చు. గణేష్, 9490369404 రమేష్, 6301848827 జోగారావు, 8985783877, వెంకటేశ్వరరావు 9550864517 ముత్తయ్య 9491062590 భద్రయ్య 9553141960 బుచ్చిరాజు 7702998323 చిన్నబ్బాయి 9701654988