PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 6:20 am Posted By : M CHANTI BABU

ఏప్రిల్ 24 న దామనపల్లి సచివాలయంలో గ్రామసభ  

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 22: మండలంలోని దామనాపల్లి గ్రామ పంచాయతీలో ఈ నెల 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయం వద్ద స్టాట్యుటరీ గ్రామసభతో పాటు నేషనల్ పంచాయతీ రాజ్ డే గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్ ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ కళ్యాణ్  బాబు అధ్యక్షత వహించనున్నారు.ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు, పీసా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామ ప్రజలు హాజరు కావాలని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్.వి.ఎస్ లక్ష్మి కోరారు. అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ఎన్ఆర్ఈజీఎస్, వెలుగు, అంగన్వాడీ, ఆశ, వైద్య సిబ్బంది కూడా తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించనున్న ఈ సమావేశానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్.వి.ఎస్ లక్ష్మి విజ్ఞప్తి చేశారు.