చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 24:
బొడ్రాయిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఓటర్ లిస్ట్ పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల జనసేన ఉపాధ్యక్షులు తీగల రవి దుర్గారావు ముఖ్యంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల పేర్లు, వివరాలు సరిగా ఉన్నాయా లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు. ఎవరైనా వివరాల్లో తప్పులు గమనిస్తే వెంటనే సంబంధిత పంచాయతీ బూత్ లెవల్ ఆఫీసర్ (బ్లాక్ )ను సంప్రదించి మార్పులు చేర్పులు చేయించుకోవాలని తెలిపారు. అదేవిధంగా గ్రామ పటేల్ శ్యామల రామయ్య కూడా ఓటర్లకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజల్లో ఓటర్ లిస్ట్ సవరణలపై అవగాహన పెంపొందింది.