వీఓఏలకు 45 స్మార్ట్ ఫోన్లు పంపిణీ
– 8 మందికి రూ.8 లక్షల పీఎంఏజేఏవై సబ్సిడీ రుణాలు
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు కాజులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. టిడిపి నాయకులు వివిధ గ్రామాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వేడుకలను వైభవంగా జరిపారు. గొల్లపాలెం గ్రామంలో టిడిపి సీనియర్ నాయకుడు డాక్టర్ చుండ్రు వీర్రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై భారీ కేక్ కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ కాజులూరు మండల మహిళా సమాఖ్యలో పనిచేస్తున్న గ్రామ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు 45 మందికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. అలాగే పీఎంఏజేఏవై పథకం కింద ఎస్సీ లబ్ధిదారులైన 8 మందికి మొత్తం రూ.8 లక్షల సబ్సిడీ రుణాల చెక్కులను అందజేశారు.
అదనంగా పూర్తి సబ్సిడీతో బళ్ళ జ్యోతి అనే సభ్యురాలికి ఎగ్ కార్ట్ షాప్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఆర్థికాభివృద్ధి కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, గుత్తుల పులిరాజు, అంగర కృష్ణ, అంగర శ్రీను, కోక శ్రీహరి, హనుమంతు చౌదరి, తాతబ్బాయి, సనపల ధనరాజు, చవ్వాకుల డాక్టర్ బాబు, దడాల నాగార్జున, వల్లు అర్జున్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.అలాగే కాజులూరు మండల ఏపీఎం టి. రాము, సీసీలు సురేష్, రఘురామ్, జ్యోతి, విఓఏలు మరియు ఇతర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.