PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 4:50 pm Posted By : M CHANTI BABU

కూటమినేతల సమక్షంలో జీకే వీధిలో  ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి 

కూటమినేతల సమక్షంలో జీకే వీధిలో  ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 14:మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజలు ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ సమాజంలోని పీడిత వర్గాల అభ్యున్నతికి, సమాన హక్కుల సాధనకు జీవితాంతం కృషి చేసిన మహానేతగా పలువురు వక్తలు కొనియాడారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లె వీర వెంకట్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొర్ర బలరాం, మండల ప్రధాన కార్యదర్శి నాగమణి, జనసేన పార్టీ పంచాయతీ అధ్యక్షుడు గడుతూరి పరిమేశ్వరరావు, రింతాడా కార్యదర్శి గబులంగి గణేష్, సాగిన బ్రహ్మాజీ, పీసా సభ్యుడు లకే రామచంద్ర, జనసేన నాయకుడు నరసింగరావు, మాజీ జడ్పీటీసీ నళిని, టీడీపీ నాయకులు ముక్కాలి మహేష్, ముక్కాలి రమేష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. “జోహార్ అంబేద్కర్ జోహార్” అంటూ నినాదాలు చేశారు.వేడుకల్లో పాల్గొన్నవారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో సమానత్వం, న్యాయం, సోదరభావం నెలకొల్పేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.