PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:49 pm Posted By : YEDUKONDALU DADALA

కోలంక రైతు సేవ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం

కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 21: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, కోలంక పరిధిలోని రైతు సేవ కేంద్రంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోలంక సొసైటీ అధ్యక్షులు బొండా వెంకట నరసింహ నాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అశోక్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసన్న మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొండా వెంకన్న, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు దాట్ల వెంకటపతి రాజు, రైతులు మేడిశెట్టి శంకర కృష్ణ, నామా కుమార్ స్వామి, మద్దా సత్యనారాయణ, సొసైటీ సీఈఓ బొండా రామన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.